వెంకన్న బ్రహ్మోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది
ప్రత్యేక పూజలు
స్పాట్ వాయిస్ నర్సంపేట, ఖానాపురం : మండలంలోని బుధరావుపేట శ్రీ భూ నీళాసమేత వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ ద్వారా మంజూరు చేయించి నిర్మించిన రూ. 35 లక్షల విలువల గల కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేపించిన పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు , మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య ఎంపీటీసీ సుభాన్ బీ మౌలానా , సర్పంచ్ కాసా ప్రవీణ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షుడు యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Recent Comments