నర్సంపేట గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలి
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఖానాపురం మండలం లో పోడు రైతులకు పట్టాల పంపిణీ
స్పాట్ వాయిస్ నర్సంపేట, ఖానాపురం : నర్సంపేట గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగిరేలా చేసి తద్వారా ఎన్నో ఏండ్ల పొడుభూముల పట్టాల కల నెరవేర్చిన సీఎం కేసీ ఆర్ కు కృతజ్ఞతలు తెలపాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. ఖానాపూర్ మండలంలోని, మనుబోతుల గడ్డ , నాజీతండా, వేపచెట్టు తండా, బోడుతండా, దర్మారావుపేట, గ్రామ పంచాయతీలకు సంబంధిoచిన అటవీ హక్కుదారులకు మొత్తం 2,420 ఎకరాలకు గాను 940 పట్టాలను నేడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజన బిడ్డల సుదీర్ఘకాలపు ఆకాంక్ష నెరవేర్చినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్బంధంతో వారు సాగు చేసుకుంటున్న తమకున్న పోడు భూమిపై ఎలాంటి చట్టపరమైన హక్కులు లేకపోవడంతో పండిన అరకొర పంటలతో ఇన్ని రోజులు బిక్కు బిక్కు మంటూ జీవితాన్ని గడిపిన గిరిజనులకు నేడు వారి సొంత భూములకు శాశ్వత హక్కులు లభించడం ఎంతో సంతోకరమన్నారు. ఇది ఏ ఒక్కరిద్దరి కృషితో సాధ్యపడింది కాదని అనేక సార్లు సర్వే చేయించి ఫారెస్ట్ అధికారులను ఒప్పించి పలు మార్లు కలెక్టర్, ఉన్నతాధకారులతో మాట్లాడి వీలైనంత ఎక్కువమందికి హక్కు పత్రాలు వచ్చేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. దాని ఫలితమే మీరంతా నేడు హక్కు పత్రాలు పొందడం జరిగిందన్నారు. మంగళవారి పేట చుట్టుపక్కల తండాలకు సంబంధించి ఉన్న వందల ఎకరాల భూమికి వక్ఫ్ బోర్డు వారు ఈ భూమి తమదని కోర్టులో కేసులు వేసి రైతులకు నోటీసులు ఇవ్వగా అనేక ఏండ్లు ఖాస్తుల్లో ఉంటున్న వారికే చెందాలని పోరాటం చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేసి, వారిని ఒప్పించి నేడు అదే భూముల రైతులకు పట్టాలను అందించినందుకు ఎంతో గర్విస్తున్నానన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెంది, ప్రతీ వర్గానికి, సమన్యాయం జరుగుతోందన్నారు. నేటి నుండి పోడు భూములకు కూడా రైతుబంధు, రైతు బీమా వర్తిస్తాయని లోన్లు ఇతర బ్యాంకు లావాదేవీలలో కూడా అటవీ హక్కు పత్రాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ భూములకు త్రీఫేస్ కరెంటు కూడా రాబోతుందని తెలిపారు.
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
కార్యక్రమాల అనంతరం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగం గురించి మూడు గంటల విద్యుత్ చాలని వ్యవసాయాన్ని అపహాస్యం చేస్తూ, రైతన్న శ్రమను చులకన చేసి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ స్థానిక మంగళవారిపేట నాయకులు ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పై కార్యక్రమాలలో డీసీఎంస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఎఫ్ఆర్సీ డిస్ట్రిక్ లెవల్ కమిటీ చైర్ పర్సన్ జడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న, స్థానిక ఎంపీపీ ప్రకాష్ రావు, నాయకులు బత్తిని శ్రీనివాస్, మహాలక్ష్మి వెంకట నరసయ్య, వెంకట రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు, ఎఫ్ఆర్వో రమేష్, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments