బండి సంజయ్కు సిట్ నోటీసులు
లీకేజీ ఆధారాలతో రావాలని పిలుపు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి మంగళవారం సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ అంశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ బండి సంజయ్ ని కోరింది. ఇటీవల టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ కాగా, ఒకే ఊరిలో ఎక్కువమందికి 100 మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. సరిగ్గా, ఇలాంటి ఆరోపణలు చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ఆధారాలతో సహా రావాలంటూ సిట్ రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది.
బండి సంజయ్కు సిట్ నోటీసులు
RELATED ARTICLES
Recent Comments