Sunday, February 23, 2025
Homeజనరల్ న్యూస్నో రిసిప్ట్.. ఎందుకు..?

నో రిసిప్ట్.. ఎందుకు..?

భూపాలపల్లిలోని మీ సేవలో సర్టిఫికెట్ల దందా..
ఆ రెండు సెంటర్లు వసూళ్లకు కేరాఫ్..
మంజూర్ నగర్ లోని సెంటర్ లోనూ దందా
ఆ సెంటర్లలోనే పదుల సంఖ్యలో బర్త్ సర్టిఫికెట్లు ఎలా..?
సహకరిస్తున్న తహశీల్‌లోని పలువురు సిబ్బంది
కలెక్టరేట్ లో చర్చనీయాంశంగా మారిన మీసేవ దందా
చర్యల కోసం ఎదురుచూస్తున్న భూపాలపల్లి ప్రజలు

స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పలు మీ సేవ సెంటర్లు సర్టిఫికెట్ల దందా చేస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో కుమ్మకై.. బర్త్,ఫ్యామిలీ సర్టిఫికెట్లకు రూ.5వేల వరకు వసూలు చేస్తు్న్నట్లు సమాచారం. సింగరేణి ఉద్యోగులకు ఆదాయం, ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చే ఘనాపాటిలు ఆ మీ సేవా సెంటర్ల నిర్వాహకులు. భూపాలపల్లి పట్టణంతో పాటు మంజూరు నగర్ లో మరో సెంటర్ ఈ దందాలో ఆరితేరినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఆ
వసూలే వసూల్..
భూపాలపల్లి పట్టణంలోని రెండు మీ సేవ సెంటర్లు, మంజూర్ నగర్ లో మరో సెంటర్ ప్రజల ముక్కుపిండి వసూల్ చేస్తున్నాయి. నిబంధనలు.. గిబంధనలు జాన్త నయ్ అన్నట్లుగా వీరి దందా సాగుతుంది. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలకు రూ.45 తీసుకోవాల్సి ఉండగా.. ఈ సెంటర్లలో మాత్రం రూ.వంద నుంచి 150 వసూల్ చేస్తున్నారు. ఇక ఈ సెంటర్ల నుంచి బర్త్, ఫ్యామిలీ సర్టిఫికెట్ల రావాలంటే రూ.5వేల నుంచి 10వేల వరకు ఇచ్చుకోవాల్సిందే. బర్త్, ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఈ సెంటర్ల నుంచే సులువుగా వస్తుండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఇతర మీ సేవ సెంటర్ నుంచి అప్లై చేసినా తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్ కనిపించకుండా పోతుంది. అలాగే సింగరేణి ఉద్యోగులకు ఆదాయం, ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చే స్థాయికి చేరారి ఘనాపాటిలు.

నో రిసిప్ట్..
మీ సేవ సెంటర్ లో ఏదైనా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే రిసిప్ట్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ సేవ సెంటర్ల నిర్వాహకులకు రిసిప్ట్ లు ఈఎస్ డీ కమిషనర్ నుంచి వస్తాయి. వీరికి ప్రింట్ ఇవ్వడం వల్లే వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ చేసే దందా అందరికీ తెలిసిపోతుందని రిసిప్ట్ ఇవ్వకుండా తెల్లపేపర్ పై దరఖాస్తు నెంబర్ రాసి ఇచ్చి పంపుతున్నారు. యథేచ్ఛగా సాగుతున్న వీరి దందాకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.
అధికారుల ఆరా..
మీ సేవ సెంటర్లలో అధిక డబ్బుల వసూల్, సింగరేణి ఉద్యోగులకు ఆదాయం, సర్టిఫికెట్లు జారీ చేయడంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. స్పాట్ వాయిస్ లో కథనం వచ్చిన మరునాడే తహసీల్దార్ కార్యాలయం నుంచి మీ సేవ సెంటర్లు నిబంధనలు పాటించాలని ప్రెస్ నోట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కలెక్టరేట్ లోనూ మీ సేవ దందా అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో మీ సేవ సెంటర్ల దందాపై ఫోకస్ చేస్తే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని వేడుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments