Friday, November 22, 2024
Homeతెలంగాణజాబ్ క్యాలెండర్ లో జాబ్స్ లేవు.. 

జాబ్ క్యాలెండర్ లో జాబ్స్ లేవు.. 

జాబ్ క్యాలెండర్ లో జాబ్స్ లేవు.. 

అది ఉద్యోగాల క్యాలెండర్ కాదు.. ఉత్తుత్తిదే.. 

తెలంగాణ ఎంపీలను నిలదీయాలి

నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం..

జీవో 46 ను రద్దు చేసే వరకూ పోరాటం

బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి 

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : ‘మైసూర్ బజ్జీలో బజ్జీ ఉంటుంది.. బొంబాయి రవ్వలో రవ్వ ఉంటుంది.. కానీ కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో ఎలాంటి జాబ్స్ లేవు. అది ఉద్యోగాల క్యాలెండర్ కాదు. ఉత్తుత్తి క్యాలెండర్. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల నుండి తప్పించుకునే క్యాలెండర్ ’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి వివర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వీడియా సమావేశంలో రాకేశ్‌రెడ్డి మాట్లాడారు. తమ ఓట్లతో గెలిచి తమ డిమాండ్లపై ఎందుకు స్పందించరని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ ఎంపీలను నిలదీయాలని ఆయన నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. రుద్యోగ యువత అధైర్య పడొద్దని, వారికి బీఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఇచ్చిన ఉద్యోగాలను మేమే ఇచ్చినం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గు అనిపిస్తలేదా? ఈ విషయంలో దమ్ముంటే మాజీ మినిస్టర్ కేటీఆర్ సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. జీవో 46 రద్దు చేసే వరకూ పోరాడతామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అమాయక యువతను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఊరు వాడ, చేను చెలక తిరిగి కాంగ్రెస్ ను గద్దెనెక్కించి అధికారం ఇస్తే, నేడు అదే యువత తమ సమస్యలను పరిష్కరించమని అడిగితే గద్దెళ్లెక్క ఎత్తుకెళ్లి పోలీస్ స్టేషన్ లో బంధిస్తున్నారని, అక్రమ కేసుకు పెడుతున్నారని, ఇది చాల దుర్మార్గమన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణమైన యువత, నిరుద్యోగులు, జీవో 46 బాధితులేనన్నారు. జీవో46 భాదితులు ప్రజా భవన్‌కు వెళ్తే అర్ధరాత్రి వారిని కొట్టి అరెస్టు చేశారని.. ప్రజా పాలన అంటే ఇదేనా అని ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. బీహార్, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల జాబ్ క్యాలెండర్ ల లెక్క కూడా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేకపోవడం తో తెలంగాణ పరువు పోయిందని వాపోయారు.

పోలీస్ స్టేషన్ లో జీవో 46 బాధితులు 24 గంటలు పోలీస్ స్టేషన్ లోనే నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, మీడియాను అనుమతించలేదని, ఎవరిని పరామర్శించే అవకాశం ఇవ్వకుండా పరామర్శిస్తే ఫొటోలు వీడియోలు తియ్యకుండా ఆంక్షలు పెట్టి అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. జీవో 46 కేసును 26 సార్లు వాయిదా వేశారని, ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇన్నిసార్లు వాయిదా పడిన కేసు బహుశా ఇదేనేమో! రాకేశ్ రెడ్డి వాపోయారు.పెద్ద పెద్ద హోర్డింగ్ లు, పేపర్ లలో ప్రకటనలు వేసి, టీవీల్లో స్టోరీలు వేసి నిరుద్యోగ యువతను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు తెల్ల కాగితం మీద జాబ్ క్యాలెండర్ పేరిట ఒక ప్రకటన విడుదల చేశారని, అందులో ఉ మాత్రం శాస్త్రీయత లేదన్నారు. ముఖ్యమంత్రి ఏమో పేగులు మేడలేసుకుంటా.., ఓ మంత్రేమో చెప్పుతో కొడతా., ఇంకో ఎమ్మెల్యేనేమో మీ అంతు చూస్తా అంటున్నాడని, ఇక ఓ ఎమ్మెల్సీ ఏమో ఏం మాట్లాడాలో తెలియక సొంత పార్టీనే బూతులు తిడుతున్నాడని, ఇందంంతా చూస్తున్న మాకు, ప్రజలకు ఈ ప్రభుత్వం డిస్కవరి చానెల్లో చూపించే అమెజాన్ అడవిలాగా ఉందనిపిస్తోందని, వారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేష్టలు చూస్తుంటే ఆ అమెజాన్ అడవుల్లోని వింత వింత జీవరాశుల్లాగా కనిపిస్తున్నారనన్నారు. ఇది ప్రజా భవన్, ప్రజల సమస్యలను తీర్చే భవన్, ప్రజల కష్టాలను తీర్చడం, ప్రజల కన్నీరు తుడవడమే ప్రజా భవన్ కర్తవం అని గప్పాలు కొట్టుడు కాదు. నిజంగా చేసి చూపించాలని ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments