వడ్డేపల్లి చెరువులో నిట్ విద్యార్థి మృతదేహం లభ్యం
స్పాట్ వాయిస్, కాజీపేట:కాజీపేట వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన గురువారం సాయంత్రం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుర్తు తెలియని వ్యక్తి వయస్సు 23 సంవత్సరాలు వడ్డేపల్లి చెరువు లో చనిపోయి ఉన్నాడని సమాచార రావడంతో ఘటన స్థలానికి వెళ్ళి మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీశారు. గుర్తు తెలియని వ్యక్తి చామన చాయ రంగు ఒంటిపై నల్లటి లోయర్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలుసుకోగా నిట్ లో బీటెక్ 2 సంవత్సరం చదువుతున్న హృతిక్ సాయి గా గుర్తించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Recent Comments