విషమంగానే ప్రీతి ఆరోగ్యం..
మెడికల్ బులిటెన్ విడుదల
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎంలో సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ మెడికల్ బులిటెన్ విడుదల చేశారు. వైద్య విద్యార్థిని ప్రస్తుతం ఏక్మో మీదనే ఉందని.. డయాలసిస్ ప్రక్రియ కొనసాగుతుందని నిమ్స్ సూపరింటెండెంట్ వెల్లడించారు. గుండె, కిడ్నీ పనితీరులో కొంత మెరుగుదల కనిపించినట్లు వైద్యులు పేర్కొన్నారు. వెంటిలేటర్ ద్వారా బాధితురాలు ఆక్సిజన్ తీసుకుంటోందని.. ఎక్మో పెట్టడం వల్ల బీపీ, పల్స్లో పురోగతి కనిపించిందన్నారు. అన్ని విభాగాల్లో నిపుణులైన వైద్య బృందంతో నిరంతరం పర్యవేక్షిస్తూ… చికిత్స కొనసాగిస్తున్నట్లు మెడికల్ బులిటెన్లో వెల్లడించారు.
Recent Comments