Friday, November 22, 2024
Homeతెలంగాణపుంజుకుంటున్న నీలం బలం..

పుంజుకుంటున్న నీలం బలం..

మేమున్నామంటూ కదిలొస్తున్న బలగం..
కాంగ్రెస్ గూటికి ఐలాపురం నాయకులు ప్రజలు..

స్పాట్ వాయిస్, బ్యూరో: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు బలం రోజురోజుకూ పుంజుకుంటోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రతిపక్ష పార్టీలకు అందకుండా దూసుకెళ్తున్నారు. మేమున్నామంటూ బలగం కదిలొస్తుండగా.. విజయం దాసోహం అంటోంది. ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ అని తేల్చగా.. అందులోనూ యువ నేత, బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ ముందున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా మెదక్ పార్లమెంట్ లో నీలం మధు అన్ని వర్గాలను కలుపుకుపోతూ.. శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఐఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు, పటాన్ చెరు ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీం సమక్షంలో ఐలాపురం వాసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామం, తండా వాసులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐలాపూర్ మాజీ సర్పంచ్ ఇస్లావత్ రవి నాయక్, కుర్మా మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, తండా వాసులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు హబీబ్, అశోక్, వెంకన్న, సుధాకర్, నక్క ప్రభాకర్, ప్రశాంత్, నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు, ఐలాపురం గ్రామస్తులు పాల్గొన్నారు.


నీలం మధుకు పీజేఆర్ కాలనీ వాసుల సంపూర్ణ మద్దతు
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పీజేఆర్ కాలనీ వాసులను మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఆదివారం కలిశారు. ఎంపీ ఎన్నికలలో తనను గెలిపించాలని వారి మద్దతు కోరారు. ఈ సందర్భంగా కాలనీవాసులంతా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అనంతరం కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటన్నింటినీ పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నాగేంద్ర, రంజిత్, మణికుమార్, వంశీ బాలాజీ, రాజా, సురేష్, రవి వర్మ, అశోక్, గోపాల్, జగదీష్, రవిచంద్ర శాస్త్రి, భాస్కరరావు, హరీష్, కోటేశ్వరరావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments