Sunday, November 17, 2024
Homeజిల్లా వార్తలుఘనంగా శామ్యూల్‌ హానిమన్‌ వర్ధంతి

ఘనంగా శామ్యూల్‌ హానిమన్‌ వర్ధంతి

ఘనంగా శామ్యూల్‌ హానిమన్‌ వర్ధంతి

స్పాట్ వాయిస్, హన్మకొండ: హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్‌ హానిమన్‌ వర్ధంతి ఆదివారం ఓరుగల్లు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్, ఐఐహెచ్ పీ ఆధ్వర్యంలో హన్మకొండ బాలసముద్రంలో ఘనంగా జరిగింది. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. హోమియో వైద్య విధానంలో వ్యక్తి యొక్క శారీరక, మానసిక, వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకొని అవే లక్షణాలు కలిగిన హోమియో మందును ఎన్నుకొని చికిత్స చేస్తారన్నారు. తద్వారా ఆధునిక యుగంలో వచ్చే ఎన్నో రకాల వ్యాధులు హోమియో మందులతో నయం అవుతున్నాయని, వినూత్న విప్లవాత్మకత వైద్య విధానాన్ని డాక్టర్ హానిమన్‌ అవిష్కరించి ప్రజలకు అందిచడం హర్షనీయమన్నారు.

హోమియోపతి వైద్యం దినదినం అభివృద్ధి చెందుతుందని ఇంకా ప్రజల్లోకి పోవాలనే ఉద్దేశంతో నిత్యం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నేడు చాలామంది హోమియో వైద్యాన్ని ఆదరిస్తున్నారన్నారు. అనంతరం డాక్టర్ పావుశెట్టి శ్రీధర్, సీనియర్ హోమియో ఫిజీషియన్ డాక్టర్ బి.పవన్ కుమార్ ను ఓరుగల్లు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఇటీవల ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ హోమియోపతి ఫిజిషన్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డాక్టర్ పావుశెట్టి శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా డాక్టర్ బి పవన్ కుమార్ ఎన్నిక కావడం పట్ల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ఓరుగల్లు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ రావు, అధ్యక్షుడు డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నామసాని రాంబాబు, ఉపాధ్యక్షులు డాక్టర్ పీ వీ. కమల కిషోర్, డాక్టర్ కే.రేవతి , జాయింట్ సెక్రెటరీ డాక్టర్ వీవీ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ బాసాని శ్రీకాంత్, ఈసీ మెంబర్స్ డాక్టర్ డి.మాధవ రావు, డాక్టర్ టి. గీతా లక్ష్మి , డాక్టర్ ఆర్.కీర్తి, డాక్టర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments