Sunday, April 6, 2025
Homeజాతీయంమావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

86 మంది లొంగుబాటు..
గత నెలలో 64 మంది..

స్పాట్ వాయిస్, బ్యూరో: మావోయిస్టులకు వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. గత నెలలో 64 మంది మావోయిస్టులు లొంగిపోగా ఇప్పుడు 86 మంది లొంగిపోయారు. వీరంతా మల్టీజోన్‌-1 ఐజీ పి.చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్​క్వార్టర్​లో లొంగిపోయారు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ సంఖ్యలో సరెండర్లు జరిగాయని ఐజీ తెలిపారు. జనజీవన స్రవంతిలో కలవాలనే పిలుపునకు తోడు, మావోయిస్టు అగ్ర నాయకుల వేధింపులు, వసూళ్లకు తట్టుకోలేక వీరంతా లొంగిపోయినట్లు ఐజీ పి.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం నుంచి 4, పార్టీ నుంచి 4, మిగతా వారు రకరకాల సంఘాల మిలీషియా సభ్యులు ఉన్నారని తెలిపారు. జిల్లాకు చెందిన వారు 81 మంది కాగా ములుగు జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉన్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష, మిగతా సభ్యులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments