Wednesday, January 8, 2025
Homeజిల్లా వార్తలుఆంగ్ల సంవత్సరాది వద్దు...ఉగాది ముద్దు

ఆంగ్ల సంవత్సరాది వద్దు…ఉగాది ముద్దు

ఆంగ్ల సంవత్సరాది వద్దు…ఉగాది ముద్దు

విదేశీ విష సంస్కృతి డిసెంబర్ 31ని బహిష్కరిద్దాం

బీజేపీ నాయకులు సుధగని ప్రమోద్ గౌడ్

స్పాట్ వాయిస్ నల్లబెల్లి: విషసంస్కృతి అయిన ఆంగ్ల సంవత్సరం జనవరి 1ని బహిష్కరించి, తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని ఘనంగా జరుపుకోవాలని బీజేపీ నాయకుడు సుధగని ప్రమోద్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళ వారం ప్రమోద్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రపంచం అంతా మత్తులో మునిగితేలడానికి సిద్ధం అవుతుండటం చాలా దురదృష్టకరమని అన్నారు. అర్ధరాత్రి తాగి నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం అమ్మకాలు జోరుగా జరిపి, ప్రభుత్వo ఖజానా నింపుకోవలన్న ఆశతో ఉండడం దారుణమన్నారు. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు కళ్లెం వేయాలన్నారు. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 25 నుండి జనవరి 1 తెల్లారే సరికి కొన్ని కోట్లాది రూపాయల మద్యం అమ్ముడు పోతూ, అంతకుమించి వెలకట్టలేని విలువైన ప్రాణాలు మద్యం మత్తులో రాలుతూ, తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చు తున్నాయన్నారు.
విదేశీ విషసంస్కృతిలో భారతీయ యువత మునిగి తేలుతూ, ప్రాశ్చాత్య మద్యం ,మారక ద్రవ్యం,గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి, బంగారు భవిష్యత్తుని ఆగం చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు. మన చరిత్ర పూర్వ వైభవాన్ని మరిచిన యువత మనల్ని బానిసలుగా చేసి, 200 ఏళ్లు ఏలిన బ్రిటిష్ వారి సంస్కృతిని వాళ్ళను తరిమికొట్టిన తర్వాత కూడా వారి సంస్కృతిని ఇంకా అనుసరించడం సిగ్గుచేటన్నారు. జనవరి ఒకటిని మనందరం జరుపుకోవడం మానేయాలని కోరుతూ విదేశీ సంస్కృతిని విడాలని స్వదేశీ సంస్కృతిని ఆచరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments