16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు..
ఎంపీ ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్
స్పాట్ వాయిస్, బ్యూరో: కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్హులైన వారందరికీ త్వరలోనే తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటలసేపు చర్చించింది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కూడా కసరత్తు చేస్తున్నారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు అందించాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే 16 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
కీలక నిర్ణయాలు ఇవే..
**కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం
**16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు
* ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ, రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మాల ఉపకులాలు, ఏకలవ్య, బంజారా, ఆదివాసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు
* గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు
**2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయం
*4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయింపు
*ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్లు
► కొత్తగా 14 బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు
*కాళేశ్వరంపై న్యాయ విచారణకు కమిటీ ఏర్పాటు.. విచారణ కమిటీ చైర్మన్గా జస్టిస్ పినాకిని చంద్రబోస్
* విద్యుత్ కొనుగోళ్లపైనా మరో కమిటీ.. చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి
*రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయం
*యాదాద్రి పవర్ ప్లాంట్ అక్రమాలపై విచారణ జరపాలని నిర్ణయం
Recent Comments