Sunday, November 24, 2024
Homeజాతీయంకొత్త పార్లమెంట్ భవనం పిక్స్ రిలీజ్..

కొత్త పార్లమెంట్ భవనం పిక్స్ రిలీజ్..

మీరూ ఓ లుక్ వేయండి..
స్పాట్ వాయిస్, బ్యూరో: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. కొత్త పార్లమెంట్‌కు చెందిన లే ఔట్, ఫొటోల‌ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. నూత‌నంగా నిర్మించిన పార్లమెంట్ స‌ముదాయ బిల్డింగ్‌ల‌ను బడ్జెట్ సెష‌న్ (మార్చి) రెండో భాగంలో ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. కొత్త బిల్డింగ్ 65వేల చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో ఉంటుంది. సెంట్రల్ విస్టా రీడెవ‌ల‌ప్మెంట్ ప్రణాళిక‌లో భాగంగా కొత్త పార్లమెంట్ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ పనులు చేప‌డుతోంది. అత్యంత విశాల‌మైన హాల్స్‌, లైబ్రరీతో పాటు పార్కింగ్‌కు కావాల్సినంత స్థలాన్ని క‌ల్పిస్తున్నారు. హాల్స్‌, ఆఫీసు రూముల‌న్నీ ఆధునిక టెక్నాల‌జీకి త‌గ్గట్టు నిర్మించారు. కొత్త పార్లమెంట్ భ‌వ‌నంలో 888 సీట్లు కెపాసిటీతో లోక్‌స‌భ హాల్‌ను నిర్మించారు. ఇక రాజ్యస‌భ హాల్‌ను లోట‌స్ థీమ్ త‌ర‌హాలో నిర్మించారు. రాజ్యస‌భ‌లో 384 మంది స‌భ్యులు కూర్చునే రీతిలో నిర్మాణం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments