13 మండలాల ఏర్పాటుకు ఉత్తర్వుల జారీ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ర్టంలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజావసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు.
ఆయా జిల్లాల్లోని రెవిన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటైన మండలాలు
* నారాయణ పేట జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో గుండుమల్ , కొత్తపల్లె మండలాలు
* వికారాబాద్ జిల్లా, తాండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దుడ్యాల్ మండలం.
* మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో కౌకుంట్ల మండలం.
* నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు.
* నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం.
* మహబూబాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో సీరోల్ మండలం.
* నల్లగొండ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో గట్టుప్పల్ మండలం.
* సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిజాం పేట్ మండలం.
* కామారెడ్డి జిల్లాలోని, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో డోంగ్లి మండలం
* జగిత్యాల జిల్లా జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో.. ఎండపల్లి మండలం
* జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిధిలో భీమారం మండలం.
Recent Comments