Saturday, April 19, 2025
Homeతెలంగాణ13 కొత్త మండలాలకు ఫైనల్ గెజిట్..

13 కొత్త మండలాలకు ఫైనల్ గెజిట్..

13 కొత్త మండలాలకు ఫైనల్ గెజిట్..

మల్లంపల్లి , కొత్తపల్లికి మొండి చెయ్యి

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: రాష్ట్రంలో 13 కొత్త మండలాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఈ ఏడాది జూలై 23న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే తుది నోటిఫికేషన్ లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు మొండి చేయి చూపారు. రేగొండ మండలంలోని కొత్తపల్లిని, ములుగు జిల్లాలోని మల్లంపల్లిని విస్మరించారు.

రెవెన్యూ మండలాలు జిల్లాల వారీగా…
*మహబూబాబాద్ జిల్లాలో
సీరోలు, ఇనుగుర్తి

*జగిత్యాల జిల్లాలో
ఎండపల్లి , భీమారం.

*సంగారెడ్డి జిల్లాలో
నిజాంపేట్.

*నల్లగొండ జిల్లాలో
గట్టుప్పల్ .

*సిద్దిపేట జిల్లాలో
అక్బర్ పెట్-భూంపల్లి, కుకునూరుపల్లి.

*కామారెడ్డి జిల్లాలో
డోంగ్లి.

*మహబూబ్ నగర్
కౌకుంట్ల.

*నిజామాబాదు జిల్లాలో
ఆలూర్, డొంకేశ్వర్ , సాలూరా.

RELATED ARTICLES

Most Popular

Recent Comments