స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐఎఫ్ డీఎస్ డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు డిమాండ్ చేశారు. నర్సంపేట లోని ఓంకార్ భవనంలో శనివారం డివిజన్ కమిటీ సభ్యుడు పెరుక వంశీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరుగబోయే పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం పకడ్బంధీగా నిర్వహించాలన్నారు. సమ్మర్ కోచింగ్ పేర ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడాన్ని అరికట్టాలన్నారు. ఈ నెల 23న జిల్లా జనరల్ బాడీ సమావేశం నర్సంపేటలో నిర్వహిస్తున్నామని, విద్యార్థులు హాజరై విజవంతం చేయాలన్నారు. సమవేశంలో రాకేష్, బిందు, రాజేష్, శ్యామ్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Recent Comments