Tuesday, December 3, 2024
Homeసినిమానాటునాటుకు ఆస్కార్..

నాటునాటుకు ఆస్కార్..

నాటునాటుకు ఆస్కార్..

తెలుగు సినీ చరిత్రలో తొలిసారి 

 స్పాట్ వాయిస్, డెస్క్: సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్​ పురస్కారాన్ని ఆర్ ఆర్ ఆర్ అందుకుంది. 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటునాటు పాటకు అవార్డ్​ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్‌ పాటలను తలదన్నుకుంటూ చివరకు వరకు చేరిన నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్​ పాడారు. ఈ పాటను చంద్రబోస్​ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రాఫర్​గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు ఎస్​.ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్​, క్రిటిక్స్ ఛాయిస్​ అవార్డులు సాధించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments