Saturday, April 5, 2025
Homeసినిమాఆస్కార్ బరిలో నాటు..నాటు

ఆస్కార్ బరిలో నాటు..నాటు

స్పాట్ వాయిస్, డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్స్‌లో నిలిచింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ టాప్‌ -4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును నాటు నాటు సాంగ్ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ అందుకున్న విషయం తెలిసిందే. 95వ అస్కార్ అవార్డు నామినేషన్స్‌లో నిలిచిన మూవీల జాబితాను మంగళవారం సాయంత్రం ఆస్కార్ అవార్డుల కమిటీ ప్రకటించింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు విభాగాల్లోనూ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ దర్శకుడు రాజమౌళి, నటులు జూ. ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ లకు తాజా ప్రకటనతో నిరాశకు గురయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments