డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మే డే
స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఎర్ర జెండాలను ఎగురవేసి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సంపేట పట్టణం అంబేద్కర్ సెంటర్ లో టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాలను రాష్ట్రంలో అమలు చేస్తూ, కార్మిక వర్గానికి రక్షణగా ఉంటుందన్నారు.
కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు.
కార్మికులు ఉద్యోగ భద్రత, ఆరోగ్య మరియు జీవిత భీమా అందించేందుకు ఎంతో కృషి చేస్తుందని, ఈ విధమైన సదుపాయాలు అన్ని రకాల కార్మిక సంఘాలకు కల్పించేందుకు ప్రణాళిక జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మున్సిపల్ ఛైర్ పర్సన్ గుంటి రజిని కిషన్, హమాలీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాలడుగుల రమేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకట నారాయణ, నల్ల మనోహర్ రెడ్డి, లెక్కల విద్యాసాగర్ రెడ్డి, కౌన్సిలర్స్ దార్ల రమాదేవి, శీలం రాంబాబు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గంప రాజేశ్వర్, మున్సిపల్, హమాలీ, అంగన్ వాడీ, ఆశ, ఆటో, ఆటో రిక్షా, దాడువాయి, మార్కెట్, వెకిల్ డ్రైవర్స్, తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు.
Recent Comments