Sunday, November 24, 2024
Homeటాప్ స్టోరీస్నర్సంపేట పట్టణ అభివృద్దికి రూ.15 కోట్లు

నర్సంపేట పట్టణ అభివృద్దికి రూ.15 కోట్లు

నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఫలించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి

స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట పట్టణ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. గత ఏప్రిల్ లో నర్సంపేట ప్రాంత పర్యటనకు వచ్చిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నాటి హామీ మేరకు నేడు నర్సంపేట పట్టణంలోని పలు అభివృద్ధి నిర్మాణ పనులకు సంబంధించి
రూ.15 కోట్లను మంజూరు చేస్తూ జీవో కాపీని అందజేసినట్లు తెలిపారు. ఈ నిధులతో సుందరమైన రోడ్లు, సౌకర్యవంతంగా డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కమ్యూనిటీ భవనాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం పనుల కోసం త్వరలో మరిన్ని నిధులు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే పెద్ది తెలిపారు.

రూ.15 కోట్ల నిధులతో నర్సంపేట పట్టణంలో నిర్మించే పలు అభివృద్ధి పనులు
* మాదన్నపేట నుంచి రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు సల్లేజ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.4 కోట్లు.
* ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి ఎంఏఆర్ ఫంక్షన్ హాల్ వరకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.2 కోట్లు.
* నర్సంపేట గ్రేన్ మార్కెట్ నుంచి ఎంఏఆర్ ఫంక్షన్ హాల్ వరకు డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.1.80 కోట్లు.
* నర్సంపేట ఆడిటోరియం బ్యాలెన్స్ పనుల నిర్మాణం కోసం రూ.1.50 కోట్లు.
* నర్సంపేట కుమ్మరికుంట పార్కు అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు.
* వరంగల్ జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ రోడ్డు వరకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.1.30 కోట్లు.
* నర్సంపేట జయలక్ష్మి సెంటర్ నుంచి పాకాల రోడ్డు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.0.90 కోట్లు.
* ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి కెనాల్ వరకు (నెక్కొండ రోడ్డు) ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.0.70 కోట్లు.
* పాకాల రోడ్డు నుంచి మహబూబాబాద్ బైపాస్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.0.60 కోట్లు.
* మున్సిపాలిటీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం కోసం రూ.0.70 కోట్లు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments