Tuesday, December 3, 2024
Homeసినిమానటి పవిత్రతో నరేశ్ లిప్​లాక్

నటి పవిత్రతో నరేశ్ లిప్​లాక్

నూతన సంవత్సరంలో కొత్త జీవితం..
స్పాట్ వాయిస్, సినిమా డెస్క్: సీనియర్‌ నటుడు నరేష్‌ ప్రముఖ నటి పవిత్రతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా నరేష్‌ సోషల్‌మీడియాలో పవిత్రను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో నరేష్‌, పవిత్ర కేక్‌ కట్‌ చేస్తూ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ముద్దు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం నరేష్‌ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుతుపుతున్నాడు. పవిత్ర కూడా అడప దడపా సినిమాల్లో కనిపిస్తుంది.

కొద్దిరోజులుగా హాట్ టాపిక్..
మైసూర్‌లోని ఓ హోటల్‌లో ఇద్దరూ కలిసి ఉండగా.. నరేశ్‌ మాజీ భార్య రమ్య రఘుపతి వారిని పట్టుకున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. కాగా ఈ వార్తలపై ఇటీవలే పవిత్ర స్పందించి మేము పెళ్లి చేసుకోలేదని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నామని తెలిపింది. నరేష్‌కి మూడో భార్యతో విడాకులు కాలేదు. అందుల్లే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం అంటూ చెప్పింది. వీళ్ల బంధానికి కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆమోదం ఉన్నట్లు పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments