టెన్త్ పరీక్ష పేపర్ లీక్ నేపథ్యంలో స్పందించిన ఏపీ గవర్నమెంట్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: నారాయణ విద్యా సంస్థల అధినేత, ఏపీ మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్ లోని నివాసంలో నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్ లో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది.
తెలుగు పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9 గంటల 57 నిమిషాలకు వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ బయటకొచ్చింది. నారాయణ పాఠశాలకు చెందిన గిరిధర్ వాట్సాప్ నుంచి తెలుగు పేపర్ బయటకొచ్చింది. దీంతో నారాయణ స్కూల్స్ కు క్వశ్చన్ లీకేజీతో సంబంధం ఉందనే ఆరోపణలతో నారయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Recent Comments