Monday, November 25, 2024
Homeతెలంగాణచిన్నారికి నామకరణం చేసిన సీఎం కేసీఆర్

చిన్నారికి నామకరణం చేసిన సీఎం కేసీఆర్

చిన్నారికి నామకరణం చేసిన సీఎం కేసీఆర్

ఫలించిన తల్లిదండ్రుల తొమ్మిదేళ్ల కల..

చొరవ చూపిన ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

స్పాట్ వాయిస్ , గణపురం: తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన జనగామ సురేశ్ -అనిత దంపతులు 2013 లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్ రావు గారితోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ ఆడపిల్లకు ఇప్పటి వరకు పేరుపెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, స్థానిక నేత ఎమ్మెల్సీ సిరికొండ  మధుసూదనాచారి చొరవ తీసుకుని, తల్లిదండ్రులను బిడ్డను ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, సురేష్ -అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు..‘మహతి ’ అని నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సంప్రదాయ పద్ధతిలో ఆథిత్యమిచారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, ఊహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం సంబ్రమాశ్చర్యాలకు లోనైంది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు, ఎమ్మెల్సీ  సిరికొండ మధుసూదనాచారి కి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments