Tuesday, September 24, 2024
Homeజిల్లా వార్తలుఎంవీ యాక్ట్‌ 2019ని రద్దు చేయాలి

ఎంవీ యాక్ట్‌ 2019ని రద్దు చేయాలి

ఎంవీ యాక్ట్‌ 2019ని రద్దు చేయాలి

-పెంచిన వాహనాల పన్నులను తగ్గించాలి

-రాష్ట్ర లారీ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ‘ ఆర్టీఏ కార్యాలయ ముట్టడి

స్పాట్ వాయిస్, గణపురం: మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ 2019ను ఉపసంహరించాలని, గ్రీన్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలని రాష్ట్ర లారీ అసోసియేషన్ జేఏసీ పిలుపుమేరకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ ఆర్టీ ఏ కార్యాలయం ఎదుట 353 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఫిట్‌ నెస్‌లను పాతపద్ధతి ప్రకారమే చేయాలని, రోజుకు రూ.50 జరిమానాను రద్దు చేయాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్‌ సిగ్నేచర్‌ పర్మిట్‌ ఇవ్వాలని, పెంచిన క్వార్టర్‌ టాక్స్‌లను తగ్గించాలని కోరారు. తైబజారు రుసుం రద్దు చేయాలని, డీజిల్‌ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్టీఏ జిల్లా అధికారికి అందజేశారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ధర్నాతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. గణపురం పోలీసులు చేరుకొని ధర్నాను విరమింపచేసి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రోడ్ల రవి, భూపాలపల్లి అసోసియేషన్ ఇంచార్జ్ తమ్మినేటి రామ్ రెడ్డి, మేనం రాజేందర్, ప్రతాప్ రెడ్డి, కుమ్మెర అశోక్, రాజు గణపురం లారీ అసోసియేషన్ బాధ్యులు కొవ్వూరి శ్రీనివాస్, దాసరి సంపత్, గుండ్రాతి సురేందర్, నవీన్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments