Monday, April 14, 2025
Homeజనరల్ న్యూస్పెండ్లిలో మటన్ కోసం లొల్లి..

పెండ్లిలో మటన్ కోసం లొల్లి..

పెండ్లిలో మటన్ కోసం లొల్లి..

తలలు పగలగొట్టుకున్న వరుడు-వధువు బంధువులు

స్పాట్ వాయిస్, బ్యూరో: నిజామాబాద్​జిల్లా నవీపేటలో పెళ్లి భోజనంలో మటన్​ సరిగ్గా వడ్డించలేదని వరుడు, వధువు తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎస్సై వినయ్​, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటకు చెందిన యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఫంక్షన్​హాలులో పెళ్లి జరిపించారు. అనంతరం విందులో వరుడి తరఫున వారు కొందరు యువకులకు మటన్ వడ్డించారు. కానీ మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ ఈ యువకులు వడ్డించేవారితో గొడవకు దిగారు. వధువు తరఫు బంధువులు కల్పించుకోవడంతో ఇరుపక్షాల మధ్య గొడవ నెలకొంది. ఇది కాస్త ముదిరి వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకునేవరకు దారి తీసింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకున్న వారు ఇరువర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మందికి, మరో వర్గానికి చెందిన సాయిబాబాతో కలిపి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గాయపడిసిన సత్యనారాయణ, సాయిబాబా సహా ఎనిమిది మందిని నిజామాబాద్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments