సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గోమాసే
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని సెగ్గంపల్లి గ్రామంలో నేతకాని, మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నేతకాని, మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గోమాసే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గోమాసే మాట్లాడుతూ.. 27న భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్ లో తలపెట్టిన నేతకాని మహర్ గర్జనను ( నేతకాని ఆత్మగౌరవ మహాసభ ) విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జవ్వాజి తిరుపతి స్తంభంపల్లి సర్పంచ్ రాజన్న, చల్లూరి మధు, గోమాస భూమయ్య, చల్లూరి సమ్మయ్య, భూపాలపల్లి మండల అధ్యక్షుడు సెగ్గం రాజసమ్మయ్య, జనగాం మల్లేష్, ఆకుదారి సత్యనారాయణ, జిముడ శంకర్, జిల్లా యూత్ అధ్యక్షులు గజ్జె రాజ్ కుమార్, దుర్గం రవి, యూత్ నాయకులు బౌతు రమేష్, రాజేష్ , బౌతు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేతకాని మహర్ గర్జనను విజయవంతం చేయాలి
RELATED ARTICLES
Recent Comments