తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు షేక్ జావిద్
స్పాట్ వాయిస్, నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు కె జావిద్ కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. రంజాన్ నెలలో ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా(బట్టల పంపిణీ ) కార్యక్రమాలు ప్రకటించి చేతులు దులుపుకుంటోందన్నారు. ఈ కార్యక్రమాలకు రూ.29 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. వీటితో ముస్లింలకు ఒరిగేదేమీ లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముస్లింలకు ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ హామీని అమలు చేయాలని ఆయన కోరారు. అదే విధంగా బడ్జెట్లో 12 శాతం నిధులు కేటాయించాలని, వక్ఫ్ బోర్డు జుడిషియల్ పవర్ లో కల్పించాలన్నారు. నిరుపేద ముస్లింలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలని, బ్యాంకుల తో సంబంధం లేకుండా నేరుగా రుణాలు అందించాలని కోరారు. టీఎస్ పీఎస్సీలో ఉన్న సభ్యుల్లో ఒక ముస్లిం మైనార్టీ సభ్యుడిని నియమించాలని డిమాండ్ చేశారు.
ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
RELATED ARTICLES
Recent Comments