రాజలింగమూర్తి హత్య కేసులో 10 మంది..
ఏడుగురి అరెస్ట్.. పరారీలో ముగ్గురు
ఏ 8 గా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు
భూ తగాదాలే హత్యకు కారణం
వెల్లడించిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
స్పాట్ వాయిస్,భూపాలపల్లి జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు చేధించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో పది మందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నాగవెల్లి రాజలింగమూర్తిని హత్య చేసిన ఘటనలో 10 మందిపై కేసు నమోదు కాగా, 7 గురు రేణిగుంట్ల సంజీవ్, పింగిలి సేమంత్, మోరే కుమార్, కొత్తూరు కిరణ్, రేణిగుంట్ల కొమురయ్య, దాసరపు కృష్ణ, రేణిగుంట్ల సాంబయ్య ను అరెస్టు చేశామని వెల్లడించారు. అలాగే మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే కరం భూమి విషయంలో తలెత్తిన తగాదాతో నిందితులు రాజలింగమూర్తిని కత్తులు, ఇనుపరాడ్లతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Recent Comments