దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా ప్రధాన కార్యదర్శి దారుణ హత్య..
స్పాట్ వాయిస్, దామెర : హన్మకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల యుగేంధర్ (32) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపేశారు. పాత కక్షలతోనే యుగంధర్‌ను హత్య చేసినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments