Wednesday, May 28, 2025
Homeలేటెస్ట్ న్యూస్తమవల్ల నష్టం జరిగితే రాజీనామా చేస్తాo..

తమవల్ల నష్టం జరిగితే రాజీనామా చేస్తాo..

 

తమవల్ల నష్టం జరిగితే రాజీనామా చేస్తాo

భూపాలపల్లి మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్

స్పాట్ వాయిస్, భూపాలపల్లి : తమ వల్ల ప్రజలకు, పార్టీకి, ఎమ్మెల్యేకు నష్టం జరిగితే రాజీనామా చేయడానికి సిద్ధమని భూపాలపల్లి మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ప్రకటించారు. ఈ మేరకు లెక్కను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు మాట్లాడుతూ.. తమ అనుచరులకు ఇండ్లు కేటాయించలేదనే అక్కసుతోనే కౌన్సిలర్ లు అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం కౌన్సిలర్ లు వీరిపై అవిశ్వాస ప్రతిపాదన లేఖను అడిషనల్ కలెక్టర్ కు అందజేశారు. 30మంది లో 20 మంది కౌన్సిలర్ లు వీరి పని తీరును వ్యతిరేకిచారు.ఇక వీరిపై అవిశ్వాస ప్రతిపాదన రావడం ఇది మూడో సారి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments