మళ్ళీ మున్నేరు ముంచేనా..
క్షణక్షణo పెరుగుతున్న వరద..
రాత్రి 8అడుగులు.. ఉదయానికి 16 అడుగులు..
ఖమ్మం వెళ్లిన డిప్యూటీ సీఎం.., మంత్రి
స్పాట్ వాయిస్, ఖమ్మం : రాష్ట్రంలో వర్షాలు మళ్ళీ జోరుగా కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మున్నేరు వాగుకు మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది. శనివారం రాత్రి వరకు 8 అడుగులు ఉన్న మున్నేరు ప్రస్తుతం ఖమ్మం వద్ద 16 అడుగులక వరద ప్రవాహం చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 24 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ముందస్తు చర్యలుగా మున్నేరు ముంపు ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. గత నెల 30, 31 తేదీల్లో 36 అడుగులకు పైగా వరద వచ్చి.. బీభత్సo చేసింది. ఆ వరద నుంచి కోలుకోక ముందే మళ్లీ మున్నేరుకి వరద రావడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం.. మంత్రి..
మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండటంతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హుటాహుటిన ఖమ్మం బయల్దేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Recent Comments