అల్లాడుతున్న ములుగు
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు..
విరిగిపడిన చెట్లు..
స్తంభించిన రవాణా..
స్పాట్ వాయిస్ , ములుగు: ఎడతెరిపి లేని వర్షంతో ములుగు జిల్లా అల్లాడుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరీ చేరుతోంది. కాలనీలు చెరువుల ను తలపిస్తున్నాయి.
గాలులకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఇక లో లెవల్ వంతెనలు ఉధృతం గా ప్రవహిస్తుండగా.. రవాణా స్తంభించింది. తాడ్వాయి మండలం మేడారం లోని జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.జంట వంతెనల వీధి నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో వాగు పరిసర ప్రాంతాలమలు వరదనీటిలో మునిగిపోయాయి.
ఏటురునాగారం- మంగపేట మండలాల మధ్య జీడివాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Recent Comments