స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. ఉగాది సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంత్ అయ్యారు. ఈ ప్రమాదం జిల్లాలోని ఏటూరునాగారం మండలం రొయ్యూరులో చోటుచేసుకుంది. గ్రామ దేవతను గంగ స్నానానికి తీసుకెళ్లిన సమయంలో.. ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులతో పాటు ఓ బాలుడు గోదావరిలో కొట్టుకు పోయారు. గల్లంతు అయిన వారు రోయ్యూరు గ్రామానికి చెందిన బెడిక సతీశ్ (17), సాయివర్ధన్ (17), సందీప్ (12)గా గుర్తించారు. వీరి కోసం జాలర్లు తీవ్రంగా గాలిస్తున్నారు.
Recent Comments