సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
స్పాట్ వాయిస్, ములుగు : పలు పత్రికలలో నిరాధారమైన వ్యాఖ్యలతో వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. బండారు పల్లి గ్రామంలోని 1571 గజాల ప్రభుత్వ భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్లు వచ్చిన కథనాలు సరైనవి కావని, గ్రామ పంచాయతీ పరిధిలోని ఇల్లు, ఇంటికి సంబంధించిన ఆన్ లైన్ అసెస్మెంట్, ప్లాన్, పర్మిషన్ పత్రంలో ఉన్న విస్తీర్ణం ప్రామాణికంతో రిజిస్ట్రేషన్ చేసినట్లు తస్లీమా తెలిపారు. ఆ ఆస్తికి సంబంధించిన వ్యక్తులు నాకు బినామీ అంటూ వస్తున్న కథనాలపై తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆ ఆస్తిపై కొందరు దాడులు చేసుకున్నట్లు తన దృష్టికి వచ్చినందని, ఆ విషయంలో ఎలాంటి భౌతిక దాడులు చేసుకోవద్దని సూచించారు. ఏమైనా ఉంటే చట్ట ప్రకారంగా న్యాయస్థానాలను ఆశ్రయించాలని పేర్కొన్నారు. అలాగే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉద్యోగ రీత్యా, వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్కరిపై చట్ట పరంగా వెళతానని తస్లీమా హెచ్చరించారు.
నిరాధారమైన కథనాలు సరికాదు
RELATED ARTICLES
Recent Comments