Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుఎమ్మెల్యే అండతోనే మట్టి మాఫియా

ఎమ్మెల్యే అండతోనే మట్టి మాఫియా

మాజీ ఎమ్మెల్యే, వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుదు కొండేటి శ్రీధర్
పర్వతగిరి రిజర్వాయర్ ను సందర్శించిన పార్టీ శ్రేణులు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : ఎమ్మెల్యే అరూరి రమేష్ అండతోనే మట్టి మాఫియా నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే, వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుదు కొండేటి శ్రీధర్ ఆరోపించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్వతగిరి రిజర్వాయర్ ను కొండేటి శ్రీధర్ తో పాటు స్థానిక నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ మట్టి అక్రమ రవాణా పాపం స్థానిక శాసన సభ్యుడు అరూరి రమేష్ దేనని, ఆయన ప్రోద్బలంతో స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారన్నారు. చెరువుల్లో పొక్లయినర్ తో మట్టిని తవ్వి, దానిని నక్కలపల్లి శివారు ప్రాంతాల్లో నిల్వ చేసి, ఇటుక బట్టీలకు అమ్ముకుని వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కుడికాల శ్రీధర్, రాధారపు శివకుమార్, జిల్లా యువ మోర్చా నాయకులు పిట్టల కిరణ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి క్రాంతి కుమార్, మండల ఉపాధ్యక్షులు వినోద్, శ్రావణ్, శ్రీనివాస్, మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments