Thursday, November 21, 2024
Homeజాతీయంకాంగ్రెస్ లోకి ఎంపీ కేకే..

కాంగ్రెస్ లోకి ఎంపీ కేకే..

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్​ సమక్షంలో కండువా కప్పి ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే పార్టీలోకి కేకేను ఆహ్వానించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఇంచార్జీ దీపదాస్ మున్షీ సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రాజ్యసభ పదవి 2026 ఏప్రిల్ 9 వరకు ఉంది. కేకే బీఆర్ఎస్ లో కేసీఆర్ అత్యంత సన్నిహిత వ్యక్తి ఉండేవాడు. ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇదివరకే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరికొంత మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments