గవర్నర్ పదవికి రాజీనామా..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళిసై బీజేపీ తరుఫున చెన్నై సెంట్రల్ లేదా తుత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం తమిళిసై రాజీనామా చేశారు. గవర్నర్ పదవి చేపట్టడానికి ముందు తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఇప్పుడు ఆ రాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలోకి దిగేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఎంపీ బరిలో తమిళి సై..
RELATED ARTICLES
Recent Comments