Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుసేవాలాల్ సేన ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ జన్మదిన వేడుకలు

సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ జన్మదిన వేడుకలు

సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ జన్మదిన వేడుకలు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ సంతోష్ నాయక్ ఆధ్వర్యంలో గొల్లబుద్దారం గిరిజన బాలుర వసతి గృహంలో శనివారం మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి వసతిగృహంలోని విద్యార్థులకు స్వీట్లు, పండ్లు అందజేశారు.

అనంతరం సంతోష్ నాయక్ మాట్లాడుతూ.. సీతారాం నాయక్ ఆయురారోగ్యాలతో ఉండాలని, జీవితంలో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, భవిష్యత్ లో ఉన్నత పదవులు అధిరోహించాలని, గిరిజన జాతికి దిక్సూచిగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శేఖర్ నాయక్, జీవన్ నాయక్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments