Saturday, April 5, 2025
Homeసినిమావెంటిలేటర్ పై సినీ నటుడు శరత్ బాబు 

వెంటిలేటర్ పై సినీ నటుడు శరత్ బాబు 

వెంటిలేటర్ పై సినీ నటుడు శరత్ బాబు 

విషమంగా ఆరోగ్యం 

స్పాట్ వాయిస్, సినిమా డెస్క్ : ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమించింది. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన శరత్ బాబుకు ప్రస్తుతం వెంటి లేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు శరీరమంతా ఇన్ ఫెక్షన్ వ్యాపించిందన్న డాక్టర్లు.. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి చెప్పలేమని వెల్లడించారు.

 

రామరాజ్యం సినిమాతో..

శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. శరత్ బాబు.. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments