రాంగోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష
స్పాట్ వాయిస్, డెస్క్: దర్శకుడి రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఆరేళ్ల కిందటి కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయన్ని దోషిగా తేలుస్తూ.. మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో రాంగోపాల్ వర్మపై చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండగా.. వర్మ ఒక్కసారి కూడ కోర్టుకు హాజరుకా లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించింది.
Recent Comments