సినీ ఇండస్ట్రీలో విషాదం..
రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్పాట్ వాయిస్ , డెస్క్: ప్రముఖ నటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. రెబల్ స్టార్ మృతి.. సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫ్యాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్త్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. తెలుగు చిత్రసీమలో రెబల్ స్టార్‌గా పేరొందారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గానూ అలరించారు. అయితే చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా ఆయన పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు కృష్ణంరాజు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన ఆయన మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది.
Recent Comments