Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్మోడీ నోటీసు వచ్చింది..

మోడీ నోటీసు వచ్చింది..

ఈడీ నోటీసులపై కవిత స్పందన
స్పాట్ వాయిస్, బ్యూరో: తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, వారు ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు. గురువారం ఆమె నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈడీ నోటీసులు అందాయన్న క‌విత.. ‘రాజకీయ కక్షతోచేస్తున్న కుట్ర ఇది. పెద్దగా వర్రీ కావాల్సింది కాదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదో ఒకటి చేయాలని దీన్ని మళ్లీ లేవనెత్తారు. గత ఏడాది కాలంగా విచారణ చేస్తున్నారు. టీవీ సీరియల్ లాగా లాగుతున్నారు. మా లీగల్ టీమ్ దాన్ని చూసుకుంటుంది. లాయర్లు ఎలా చెప్తే అలా చేస్తా. మేము ఎవరికీ బీ టీమ్ కాదు. తెలంగాణ ప్రజల ఏ టీమ్ మేం.” అని అన్నారు. రాజ‌కీయ ఉద్దేశంతో సాగుతున్న ఈ కేసును తెలంగాణ ప్రజ‌లు దీన్ని సీరియ‌స్‌గా తీసుకోరన్నారు. పార్టీ లీగ‌ల్ బృందం ఇచ్చే స‌ల‌హాల మేర‌కు ముందుకు వెళ్తామ‌ని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతోనూ క‌ల‌వ‌లేద‌ని, కేవ‌లం తెలంగాణ ప్రజ‌లు, భార‌త దేశ ప్రజ‌ల‌తో మ‌మేకం అయ్యామ‌న్నారు. దేశ ప్రజ‌లు సీఎం కేసీఆర్‌ను కావాల‌నుకుంటున్నార‌ని, దీంతో ఆ రెండు పార్టీల‌కు ఆ భ‌యం ప‌ట్టుకున్నట్లు ఆమె తెలిపారు. బీజేపీ ఎన్నిక‌ల స్టంట్‌లో భాగంగా ఇలాంటి చ‌ర్యల‌కు పాల్పడుతోంద‌ని ఆమె ఆరోపించారు. ప్రజ‌లే ఆ పార్టీకి బుద్ధి చెబుతార‌ని క‌విత పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments