Sunday, April 6, 2025
Homeలేటెస్ట్ న్యూస్మోడీ ఫొటో పెట్టాల్సిందే..

మోడీ ఫొటో పెట్టాల్సిందే..

మోడీ ఫొటో పెట్టాల్సిందే..
రేషన్‌ బియ్యం ఇస్తోంది కేంద్రమే..
కేవలం ఒక్క కిలో ఇచ్చి గప్పలు చెబుతున్న రాష్ట్రం
– బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌

స్పాట్ వాయిస్, వరంగల్: రేషన్‌ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని కచ్చితంగా ఏర్పాటు చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రేషన్‌ దుకాణాలను శనివారం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శాఖ సందర్శించారు. బియ్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేననంటూ రేషన్‌ లబ్ధిదారులకు వివరించారు. షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చూసి, ప్రధాని మోదీ చిత్రపటం ఏర్పాటు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం గంట రవికుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ రేషన్‌కార్డు లబ్ధిదారుడికి కేంద్రం బియ్యం సరఫరా చేస్తోందన్నారు. కార్డులోని ప్రతీ సభ్యుడికి కేంద్రం ఐదు కిలోలు ఇస్తే రాష్ట్రం కేవలం ఒక్క కిలో జతచేసి ఆరు కిలోలు ఇస్తోందని వెల్లడించారు. ఒక్కకిలో ఇచ్చినందుకే రాష్ట్రం ప్రభుత్వం తమ ఫొటోలు పెట్టుకుంటే, సింహభాగంగా ఇస్తున్న కేంద్రం ప్రభుత్వం ఫొటో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు. సొమ్మొకడిది సోకొకడిదిలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యానికి ఇంతగా హంగులు ఆర్భాటాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతీ రేషన్‌ లబ్ధిదారుడికి న్యాయం జరగాలనే వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ విధానాన్ని మోడీ తీసుకురావడంతో సత్ఫలితాలు వస్తున్నాయని గంట రవికుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికైనా మోదీ చిత్రపటాలను రేషన్‌ దుకాణాల వద్ద ఏర్పాటు చేయకుంటూ బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

బీఆర్‌ఎస్‌లానే.. కాంగ్రెస్‌..
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలాగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని రవికుమార్‌ ఆరోపించారు. కేంద్రం లబ్ధిదారులకు బియ్యం ఇస్తున్నా అంతా తామే ఇస్తున్నామని, కేంద్రం ప్రస్తావన కూడా తీసుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు బీఆర్‌ఎస్‌, నేడు కాంగ్రెస్‌ ప్రజల్ని తప్పుతోవ పట్టిస్తున్నాయని రవికుమార్‌ ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, బీఆర్‌ఎస్‌కు కర్రుకాల్చి వాత పెట్టినట్టు కాంగ్రెస్‌ కూడా పెడతారన్నారు.

ఆరు గ్యారెంటీలు ఏమాయే…
కాంగ్రెస్‌కు పాలించడం చేతకావడం లేదని, గప్పలు చెప్పిన ఆరు గ్యారెంటీల హామీలు ఏమాయే అంటూ రవికుమార్‌ నిలదీశారు. 15నెలలు దాటినా ఇంకా దాటవేత ధోరణ ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. హైడ్రా, హైదరాబాద్‌ యూనివర్సిటీ భూములు లాక్కోవాలని చూడడం ఇందుకు నిదర్శనమన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments