Monday, November 18, 2024
Homeజిల్లా వార్తలుప్రతీ ఇల్లు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటోంది

ప్రతీ ఇల్లు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటోంది

గడపగడపకూ చేరుతున్న కేంద్ర సంక్షేమ ఫలాలు
బీజేపీ తూర్పు నియోజకవర్గ నాయకుడు గంట రవికుమార్
స్పాట్ వాయిస్, వరంగల్: బీజేపీ వరంగల్ జిల్లా 33వ డివిజన్ లో చిలువేరు రాజేందర్, మండల భూపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా గద్దెను తూర్పు నియోజకవర్గ బీజేపీ నాయకుడు గంట రవికుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంట రవి కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకూ చేరుతున్నాయన్నారు. ప్రతీ ఇల్లు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎండగడుతున్న విధానాన్ని ఇంటింటికీ వివరించాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇస్తున్న నిధులు, పథకాల విశిష్టతను తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధం నరేష్, డివిజన్ అధ్యక్షుడు కొంక భాస్కర్, వనం కార్తీక్ , కేశెట్టి భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పుప్పాల రాజేందర్ , ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదాసి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు అంకాల జనార్దన్ , జిల్లా రజక సెల్ కన్వీనర్ కొత్తపల్లి రాజేష్, గోరంట్ల హరి , శ్రీరామోజు ప్రవీణ్, జీలకర్ర వీరస్వామి, గోగికర్ అనిల్, విశ్వనాథ్ పూర్ణ చందర్, అడప కిరణ్ , బండ సాయి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments