తొలి రౌండ్లో వెనుకంజలో ఉన్న ప్రధాని మోడీ మళ్లీ లీడింగ్‌లోకి వచ్చేశారు. వారణాసి లోక్‌సభ స్థానంలో ఆయనకు మెజారిటీ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ప్రధాని మోడీ 600 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. తొలుత ఈసీ వెబ్సైట్ ప్రకారం.. అజయ్ రాయ్ సుమారు 1600 ఓట్ల తేడాతో లీడింగ్‌లో కొనసాగారు. అయితే రౌండ్లు మారడంతో.. ప్రధాని మోడీ లీడింగ్‌లోకి వచ్చేశారు. వారణాసిలో 21 వేల ఓట్ల ఆధిక్యంలో మోడీ చేరుకున్నట్లు సమాచారం
Recent Comments