Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుమోడల్ స్కూల్ లో కొండచిలువ..

మోడల్ స్కూల్ లో కొండచిలువ..

మోడల్ స్కూల్ లో కొండచిలువ

స్పాట్ వాయిస్, మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మోడల్ స్కూల్ లో సోమవారం రాత్రి భారీ కొండ చిలువ కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఆంజనేయ స్వామి మాల ధరించిన భక్తులు పూజ అనంతరం మోడల్ స్కూల్ ఆవరణలో నిద్రిస్తుండగా సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన 15 అడుగుల పొడవు ఉన్న భారీ కొండ చిలువ స్వాముల వద్దకు రావడంతో వెంటనే అప్రమత్తమైన స్వాములు కొండ చిలువ విషయం మోడల్ స్కూల్ వాచ్ మెన్ కి చెప్పారు. వెంటనే అక్కడికి వచ్చిన ఆయన వెంటనే దానిని చంపి వేశాడు. మోడల్ స్కూల్ కు వేసవి సెలవలు కావడంతో స్కూల్ లో విద్యార్థులు ఎవరు లేక పోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. మోడల్ స్కూల్ కి అనుకొని దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో పాములతో పాటు అడవి జంతువులు వచ్చే అవకాశం ఉంది కావున అధికారులు తగు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు కోరుతున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments