అండగా ఉంటానని భరోసానిచ్చిన నేత
స్పాట్ వాయిస్, గణపురం: భూపాలపల్లి నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను తెలంగాణ తొలి శాసనసభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి గురువారం పరామర్శించారు. చిట్యాల మండలం జూకల్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ జంబుల చంద్రమౌళి ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. చల్లగరిగే గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు కన్నబోయిన అశోక్ తండ్రి పకీర్ ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. బావ్ సింగ్ పల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు బొంకూరి కొమురయ్య తండ్రి ఐలుకొమురయ్య ఇటీవల మరణించగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొత్తపేట గ్రామంలో దొంగరి శంకర్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఆయా గ్రామాల నాయకులు, సిరికొండ యువసేన నాయకులు తదితరులు ఉన్నారు.
Recent Comments