స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గొల్లపల్లె గ్రామంలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల సంపత్ కుమారుడి వివాహ వేడుకకు మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరయ్యారు. వధూవరులు రణధీర్ – సైరాభానులను ఆశీర్వదించారు. అలాగే భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి నీరజ – నరేష్ దంపతులను ఆశీర్వదించారు. సిరికొండ వెంట రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్, సర్పంచ్ తోట మానస శ్రీనివాస్, పరశురాంపల్లి సర్పంచ్ తాళ్లపెల్లి మంజుల భాస్కర్ రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొలసాని లక్ష్మీ నరసింహారావు, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణ చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ కొత్త పద్మ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ బైరగాని తిరుపతి గౌడ్, నాయకులు రత్నం రవి, వెంపటి అశోక్, కట్ల శంకరయ్య, సూర్యదేవర కార్తీక్, తంగళ్ళపల్లి వెంకట్, మామిడి నరసింహస్వామి, బత్తిని శంకర్, తిరుమలరావు, కొవ్వూరి శ్రీనివాస్, రేపాక రాజేందర్ తదితరులు ఉన్నారు.
వధూవరులకు ఎమ్మెల్సీ సిరికొండ ఆశీర్వాదం
RELATED ARTICLES
Recent Comments