Friday, May 23, 2025
Homeతెలంగాణఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ..!

ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ..!

అధినేత కేసీఆర్, పార్టీ తీరుపై అసంతృప్తి..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ
అస్ర్తంగా చేసుకున్న అధికార పార్టీ
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుమార్తె.. ఎమ్మెల్సీ కవిత రాసినట్లుగా ఓ లేఖ వైరల్ అవుతోంది. లెటర్ లోని విషయాలు బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే.. ఈ లేఖపై కవిత ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మే రెండో తేదీన ఆరు పేజీల్లో రాసినట్లు ఉన్న ఈ వైరల్ లేఖలో కవిత.. వరంగల్‌లో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణ తీరుపై తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. ఈ లేఖను ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments