హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..
4నెలలుగా జైల్లో ఉన్న కవిత..
స్పాట్ వాయిస్, బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం అనారోగ్యంగా ఉన్నట్లు తీహార్ జైలు సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కవితకు దీన్ దయాల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న కవితకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో దాదాపు 4 నెలలుగా కవిత జైలులో ఉన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర అస్వస్థత..
RELATED ARTICLES
Recent Comments